Chandrababu: చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చోవడంపై బండ్ల గణేశ్​ తీవ్ర వ్యాఖ్యలు

Bandla Ganesh comments on Chandrababu and Vijayasai sitting side by side

  • తన ప్రాణం పోయినా ఇలా శత్రువు అనుకున్న వాడితో కూర్చోనని వ్యాఖ్య
  • బతికితే సింహంలా బతకాలి, పోతే సింహంలా చచ్చిపోవాలంటూ ట్వీట్
  • తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి విజయసాయి రెడ్డికి దగ్గరి బంధువు

నందమూరి తారకరత్న మృతితో టీడీపీ శ్రేణులు, నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన తారకరత్న భౌతిక కాయాన్ని నిన్న హైదరాబాద్ కు తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ ఇద్దరూ చాలా సేపు తారకరత్న నివాసంలో ఉన్నారు. ఒకే సోఫాలో కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి.. విజయసాయిరెడ్డి మరదలి కూతురు. అందుకే తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి విజయసాయి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. 

ఈ క్రమంలోనే రాజకీయాలను పక్కనబెట్టి జరగాల్సిన విషయాలపై చంద్రబాబు, బాలకృష్ణతో మాట్లాడుతున్నారు. అయితే, ఈ ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన నిర్మాత బండ్ల గణేశ్.. రాజకీయంగా బద్ధశత్రువులైన బాబు, విజయసాయి ఒక్క చోట కూర్చోవడాన్ని తప్పు బట్టారు. బతికితే సింహంలా బతకాలి, చనిపోతే సింహంలా పోవాలన్నారు.  ‘నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను. అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్లిపోతా.. అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి’ అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News