Tirumala: ఒంటికి నిప్పు అంటించుకుని.. తిరుమలలో మహిళ ఆత్మహత్య

Woman commits suicide in Tirumala

  • వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా ఉన్న మరుగుదొడ్డిలో మహిళ ఆత్మహత్య
  • మృతురాలు విజయవాడకు చెందిన సుమతిగా గుర్తింపు
  • తిరుమలలో ఒక హోటల్ లో పని చేస్తున్న సుమతి

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ ఆత్మాహుతికి పాల్పడింది. వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా ఉన్న మరుగుదొడ్డిలో ఒంటికి నిప్పంటించుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. తిరుమలలోని ఒక హోటల్ లో ఆమె పని చేస్తోంది. మృతురాలిని విజయవాడకు చెందిన సుమతి (53)గా గుర్తించారు. 

వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా ఉన్న మరుగుదొడ్డి నుంచి భారీగా పొగలు రావడంతో అక్కుడున్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరుగుదొడ్డి తలుపులు పగులగొట్టి చూశారు. అందులో ఒక మహిళ మంటల్లో దహనమవుతూ కనిపించింది. ఆమెను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే ఆమె శరీరం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నిన్న రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

More Telugu News