Western Disturbance: ఉత్తర కోస్తాలో వర్షం.. వచ్చే 24 గంటల్లో చెదురుమదురు వర్షాలు

Western Disturbance Causes Rains In Coastal Andhra

  • దక్షిణ చత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం
  • నిన్న కూడా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం
  • ఇంకా మేఘావృతమై ఉన్న పలు ప్రాంతాలు

దక్షిణ చత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు వెస్ట్రన్ డిస్టర్బెన్స్  కారణంగా ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో నిన్న తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. చాలా ప్రాంతాలు ఇంకా మేఘావృతమై ఉండడంతో వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 

వెస్ట్రన్ డిస్టర్బెన్స్ అనేది మధ్యధరా ప్రాంతంలో ఉద్భవించే ఉష్ణమండల తుపాను. భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతాలకు అకస్మాత్తుగా ఇది వర్షాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడిది ఆవరించిన కారణంగానే వాతావరణంలో మార్పు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

Western Disturbance
Rains
Coastal Andhra
  • Loading...

More Telugu News