West Godavari District: పెళ్లి చేసుకుంటానని జూనియర్ ఆర్టిస్ట్‌ ను మోసం చేసిన గుంటూరు యువకుడు!

Guntur Man booked for raping junior artist

  • సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా యువతి
  • ఫోన్ నంబరు సంపాదించి పరిచయం పెంచుకున్న యువకుడు
  • యువతిని గర్భవతిని చేశాక ముఖం చాటేసిన వైనం

పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్టును గర్భవతిని చేసి ఆపై ముఖం చాటేసి తిరుగుతున్న గుంటూరు జిల్లా యువకుడిపై ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 29 ఏళ్ల యువతి 2021లో హైదరాబాద్‌కు వచ్చి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తూ బోరబండలో ఉంటోంది. 

గుంటూరు జిల్లా కాకానికి చెందిన రోహిత్ ఖాన్ (24) ఆమె ఫోన్ నంబరు సంపాదించి పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఆమెకు ఫోన్ చేసి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని కోరింది. అప్పటి నుంచి రోహిత్ ఖాన్ తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు తాజాగా ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

West Godavari District
Guntur District
Junior Artist
Crime News
  • Loading...

More Telugu News