Chandrababu: ప్రతి 30 కుటుంబాలకు సాధికార సారథి... టీడీపీలో కొత్త వ్యవస్థ

Chandrababu introduced new system in TDP
  • ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి
  • జగ్గంపేటలో టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం
  • సాధికార సారథులుగా మహిళలకు ప్రాధాన్యత
  • అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామన్న బాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జగ్గంపేటలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో ఒక కొత్త వ్యవస్థను ప్రకటించారు. 

ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథిని నియమించనున్నట్టు వెల్లడించారు. సాధికార సారథుల నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఇక మీదట ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేలా ఈ విభాగం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 

పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్చార్జిలందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని వివరించారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన వారికి అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయామని, అందుకే మరోసారి అలా జరగకుండా పటిష్ఠ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.
Chandrababu
New System
Empoerment Leader
TDP
Andhra Pradesh

More Telugu News