Varla Ramaiah: సీఎం, డీజీపీ ఆఫీసులు అక్కడే ఉన్నా... అక్కడి మహిళలకు రక్షణ లేదు: వర్ల రామయ్య

No protection for women in Tadepalli says Varla Ramaiah

  • తాడేపల్లి క్రైమ్ హబ్ గా మారిపోయిందన్న వర్ల రామయ్య
  • ఎస్తేర్ రాణి హత్యకు పోలీసుల ఉదాసీన వైఖరే కారణమని మండిపాటు
  • తప్పుడు మార్గంలో నడుస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

వైసీపీ ప్రభుత్వంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ముఖ్యమంత్రి ఉండే తాడేపల్లి క్రైమ్ హబ్ గా మారిపోయిందని విమర్శించారు. తాడేపల్లిలో ఎస్తేర్ రాణి అనే దివ్యాంగురాలిని రాజు అనే వ్యక్తి కత్తితో నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి ఈ ఉదయం ఆయన నేషనల్ ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాడేపల్లిలో సీఎం, డీజీపీ కార్యాలయాలు ఉన్నప్పటికీ మహిళలకు భద్రత లేదని మండిపడ్డారు. ఎస్తేర్ రాణిని రాజు చిత్ర హింసలు పెట్టాడంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని... ఇంతలో ఆమెను రాజు కత్తితో నరికి హత్య చేశాడని చెప్పారు. పోలీసుల ఉదాసీన వైఖరే ఈ హత్యకు కారణమని అన్నారు. 

నిందితుడు రాజు డగ్స్ కు బానిసయ్యాడని... డ్రగ్స్ దందాపై టీడీపీ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని చెప్పారు. డ్రగ్స్ ప్రభావంతో మహిళలపై జరుగుతున్న నేరాలపై లోతుగా దర్యాప్తు చేయించాలని కోరారు. తప్పుడు మార్గంలో నడుస్తున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. 

  • Loading...

More Telugu News