Tripura: త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్.. విజయం తమదేనంటున్న బీజేపీ

Tripura Votes BJP Looks To Retain Power In Multi Cornered Fight

  • త్రిపురలో కొనసాగుతున్న ఓటింగ్
  • ఉదయం 9 గంటలకు 13.23 శాతం పోలింగ్ నమోదు
  • ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి మాణిక్ సాహా
  • అధికారం నిలుపుకుంటామని ధీమా వ్యక్తం చేసిన సీఎం

ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి 13.23 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం 60 నియోజకవర్గాలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 వరకూ పోలింగ్ కొనసాగుతుందని ప్రధాని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. 

కాగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత మాణిక్ సాహా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోమారు అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ముప్ఫై ఏళ్ల పాటు త్రిపురను ఏలీన సీపీఎంకు బీజేపీ 2018లో చెక్ పెట్టింది. గత ఎన్నికల్లో 36 సీట్లను గెలుచుకుని ప్రభుత్వ పగ్గాలు చేజిక్కించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 సీట్ల మెజారిటీ కంటే ఎక్కువే గెలుచుకున్నప్పటికీ.. బీజేపీ స్థానిక ఐపీఎఫ్‌టీ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

ఇప్పుడు రాష్ట్రంలో పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్న సీపీఎం కాంగ్రెస్‌తో జట్టుకట్టి మరీ బరిలోకి దిగింది. నాలుగు సార్లు సీఎంగా ఉన్న మాణిక్ సర్కార్ ఈ కూటమికి నేతృత్వం వహిస్తున్నారు. లెఫ్ట్ ఫ్రంట్ 47 సీట్లోలో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ కేవలం 13 సీట్లకే పరిమితమైంది. 

త్రిపురలో కాంగ్రెస్, సీపీఎం‌ల కూటమి కేరళలో ఆసక్తికర పరిస్థితికి దారితీసింది. ఆ రాష్ట్రంలో ఇరు పార్టీలు రాజకీయంగా బద్ధ శ్రతువులుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక గత ఎన్నికల్లో 16 సీట్లు సాధించిన సీపీఎం..కాంగ్రెస్‌తో కూటమి తనకు లాభిస్తుందని భావిస్తోంది.

  • Loading...

More Telugu News