Narendra Modi: లండన్ లో మోదీ సెగ.. బీబీసీ కార్యాలయం ఎదుట ఎన్ఆర్ఐల ఆందోళన

Protest against BBC in London

  • గోద్రా అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ
  • వాస్తవాలకు దూరంగా ఉందన్న కేంద్ర ప్రభుత్వం
  • మోదీకి క్షమాపణ చెప్పాలంటూ ఎన్నారైల ఆందోళన

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. బీబీసీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిరసనలు దేశం దాటి విదేశాలకు కూడా పాకాయి. తాజగా లండన్ కు మోదీ సెగ తగిలింది. లండన్ లో ఉన్న బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రవాస భారతీయులు ఆందోళనలు చేపట్టారు. బీబీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ రెండు భాగాలుగా ఉంది. గోద్రా అల్లర్లపై తీసిన ఈ డాక్యుమెంటరీ వాస్తవాలకు దూరంగా ఉందని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ డాక్యుమెంటరీ లింక్ లను బ్లాక్ చేయాలని యూట్యూబ్, ట్విట్టర్ కు ఆదేశాలను కూడా ఇచ్చిందని సమాచారం.

Narendra Modi
BJP
BBC
London
  • Loading...

More Telugu News