Relangi Narasimha Rao: రాజేంద్రప్రసాద్ గురించి అలా ప్రచారం చేశారంతే: రేలంగి నరసింహారావు

Relangi Narasimha Rao Interview

  • చంద్రమోహన్ తో 24 సినిమాలు చేశానన్న రేలంగి 
  • తమది గురుశిష్యుల సంబంధమని వ్యాఖ్య  
  • రాజేంద్ర ప్రసాద్ తో 32 సినిమాలు తీశానని వివరణ

అటు జంధ్యాలకీ .. ఇటు ఈవీవీకి మధ్యలో హాస్యకథా చిత్రాలతో ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్వించిన దర్శకుడిగా రేలంగి నరసింహారావు గురించి చెప్పుకుంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. ఇంతవరకూ నేను ఓ 75 సినిమాలను తెరకెక్కించాను. వాటిలో ఓ ఐదారు సినిమాలు మినహా మిగతావన్నీ కూడా హాస్యభరితమైనవే" అన్నారు. 

"చంద్రమోహన్ తో 24 సినిమాలు తీశాను. ఆయనకీ .. నాకు మధ్య గురుశిష్యుల అనుబంధం ఉంది. ఇక రాజేంద్ర ప్రసాద్ తో 32 సినిమాలను తీశాను. మేమిద్దరం కూడా మంచి స్నేహితులుగా ఉండేవారం .. అందువలన మా మధ్య మంచి అవగాహన ఉండేది. ఆయనను కొత్తగా చూపించడానికి అప్పట్లో నేను ఎన్నో ప్రయోగాలు చేశాను" అన్నారు. 

"రాజేంద్రప్రసాద్ ను చాలా దగ్గర నుంచి చూసినవాడిని నేను. ఆయనకి చాలా కోపం ఎక్కువని చిలవలు పలవులుగా చేసి చెప్పుకునేవారు. నాకు తెలిసి ఆయన తప్పే లేదు. షాట్ 9 గంటలకని చెప్పి .. 12 గంటలైనా తీయకపోతే కోపం రాదా? కాస్ట్యూమ్స్ తాను అనుకున్నట్టుగా లేకపోతే కోపం రాదా? అలాంటి సంఘటనలను పెద్దవి చేసి ప్రచారం చేశారంతే" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News