CM Jagan: సీఎం జగన్ ను కలిసిన ఆస్ట్రేలియా ఎంపీలు

Australia MPs met AP CM Jagan

  • ఏపీ పర్యటనకు విచ్చేసిన ఆస్ట్రేలియా ఎంపీల బృందం
  • సీఎం జగన్ తో పలు అంశాలపై చర్చ
  • ఏపీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించిన ఎంపీలు

ఆస్ట్రేలియా ఎంపీల బృందం ఏపీ పర్యటనకు వచ్చింది. ఆస్ట్రేలియా ఎంపీలు నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఇంధన రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వారు ప్రశంసించారు. అనేక అంశాలపై సీఎం జగన్ తో చర్చించారు. ఏపీలో పరిస్థితులను, ప్రభుత్వ విధానాలను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఎంపీలు లీ టార్లామిస్, మాథ్యూ ఫ్రేగాన్ మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ ను కలవడం సంతోషదాయకమని, పరస్పర ఆలోచనలు, లక్ష్యాల గురించి చర్చించామని వెల్లడించారు. విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, ఆస్ట్రేలియాలో తాము ఆశిస్తున్న లక్ష్యాల్లో సారూప్యత కనిపిస్తోందని వారు అభిప్రాయపడ్డారు. గతేడాది ఏపీ ప్రజాప్రతినిధులు ఆస్ట్రేలియాలో పర్యటించడం తెలిసిందే.

CM Jagan
Australia
MPs
Tadepalli
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News