Jagapathi Babu: నేను సినిమా ఫంక్షన్స్ కి వెళ్లడం మానేసింది ఇందుకే: జగపతిబాబు

Jagapathi Babu Interview

  • 34 ఏళ్ల కెరియర్ ను పూర్తిచేసిన జగపతిబాబు 
  • ప్రస్తుతం విలన్ వేషాలతో బిజీ 
  • తనకి మాయమాటలు చెప్పడం చేతకాదని వెల్లడి 
  • అందరినీ పొగిడీ పొగిడీ అలసిపోయానని వ్యాఖ్య 

జగపతిబాబు బలమైన సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చారు. అయినా ఆయన కష్టపడుతూ .. ఎదుగుతూ వచ్చారు. విలన్ గా .. కేరక్టర్ ఆర్టిస్టుగా ఇప్పుడు ఆయన బిజీ బిజీ. ఉన్నది ఉన్నట్టుగా ముఖాన్నే మాట్లాడటం ఆయనకి అలవాటు. అలాంటి జగపతిబాబు తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"నా కెరియర్ మొదలై అప్పుడే 34 ఏళ్లు పూర్తవుతున్నాయంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. నా వరకూ నేను నా స్థాయిలో ఎంతోకొంత సాధించాననే అనుకుంటున్నాను. సినిమాలు తప్ప నాకు మరేమీ తెలియదు. ఏ బిజినెస్ లు తెలియదు  .. నలుగురిలో కలవడం తెలియదు .. మాట్లాడటం తెలియదు .. మాయమాటలు చెప్పడం తెలియదు" అన్నారు. 

"నేను ఎప్పుడూ కూడా కమర్షియల్ గా ఆలోచించను .. కమర్షియల్ గా బిహేవ్ చేయను. ఒక రకంగా అదే లోపమేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. నేను సినిమా ఫంక్షన్స్ కి కూడా వెళ్లడం మానేశాను .. ఎందుకంటే అందరినీ పొగిడీ పొగిడీ అలసిపోయాను. స్టేజ్ పై అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్లి నుంచునే అవసరం నాకు లేదు" అంటూ చెప్పుకొచ్చారు.  

Jagapathi Babu
Actor
Tollywood
  • Loading...

More Telugu News