Turkey: టర్కీలో మళ్లీ భూకంపం.. 34 వేలకు పెరిగిన మృతుల సంఖ్య

Anothedr Earthquake hits Turkey

  • 4.7 తీవ్రతతో నిన్న మరోమారు కంపించిన భూమి
  • టర్కీ, సిరియాల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
  • ప్రాణనష్టం మరింత పెరగొచ్చంటున్న అధికారులు

భూకంపంతో అపార ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూసిన టర్కీ (తుర్కియే)లో మరోమారు భూకంపం సంభవించింది. గతవారం 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం టర్కీ, సిరియాలను కుదిపేసింది. నగరాలు, పట్టణాలను శ్మశానాలుగా మార్చింది. ఆ విలయం నుంచి కోలుకోకముందే నిన్న 4.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. టర్కీ దక్షిణ నగరమైన కహ్రామన్మరాస్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే, ఈ భూకంపం కారణంగా ఏమైనా నష్టం సంభవించిందా? అన్న వివరాలు తెలియరాలేదు.

కాగా, టర్కీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద అణువణువు గాలిస్తున్న బృందాలు సజీవంగా ఉన్న వారిని వెలికి తీసి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. టర్కీ, సిరియాల్లో శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని సహాయక బృందాలు నిన్న కూడా రక్షించాయి. భూకంప మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ప్రస్తుతం 34 వేలు దాటింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 1939లో టర్కీలో సంభవించిన భూకంపం కంటే ఇది అత్యంత దారుణమైనదని పేర్కొన్నారు.

Turkey
Syria
Turkey Earthquake
Syria Earthquake
  • Loading...

More Telugu News