మళ్లీ జిమ్ లో సందడి చేస్తున్న సమంత
- గతేడాది మయోసైటిస్ బారినపడిన సమంత
- వ్యాధితో తీవ్ర పోరాటం చేసిన నటి
- క్రమంగా కోలుకుంటున్న వైనం
- తాజాగా జిమ్ లో స్క్వాట్స్ చేస్తూ కనిపించిన సామ్
లేటెస్ట్ గా ఆమె విడుదల చేసిన వీడియో అభిమానులను ఎనలేని ఆనందానికి గురిచేస్తోంది. జిమ్ ఎక్విప్ మెంట్ ను ఉపయోగించుకుని సమంత భుజాలతో స్క్వాట్స్ చేస్తూ ఆ వీడియోలో కనిపించింది. కష్టంగా ఉందా... అయితే కష్టపడండి... ఎవరూ కూడా ఇది సులభం అని చెప్పరు అంటూ ఆ వీడియోపై సమంత స్పందించింది. కాగా, వర్కౌట్లు చేసే సమయంలో సమంత చేతికి సెలైన్ నీడిల్ తో కనిపించింది.