Rohi: ఆస్ట్రేలియా ఇలా కుప్పకూలుతుందని అస్సలు ఊహించలేదు: రోహిత్ శర్మ

Rohit sharma says australias defeat is unexpected

  • తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌ మొదటి సెషన్‌లోనే కుప్పకూలిన ఆసీస్ 
  • బోర్డర్-గవాస్కర్ సీరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యం
  • ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదన్న టీమిండియా కెప్టెన్ రోహిత్

నాగ్‌పూర్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అనూహ్య వైఫల్యంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఒక్క సెషన్‌లోనే కుప్పకూలుతుందని తాము ఊహించలేదని తెలిపాడు. 

‘‘ఆస్ట్రేలియా కేవలం ఒక్క సెషన్‌లోనే కుప్పకూలుతుందని మేము అస్సలు ఊహించలేదు. పటిష్ఠంగా బౌలింగ్ చేయాలని ముందే ఊహించుకున్నాము. ఒక్కో సెషన్ గడిచే కొద్దీ మ్యాచ్‌పై పట్టు బిగించాలనేది మా ప్రణాళిక. కానీ..ఆసీస్ ఒకే సెషన్‌లో ఆలౌట్ అవుతుందని అస్సలు ఊహించలేదు. పిచ్‌పై బౌన్స్ లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. కానీ..మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. క్రెడిట్ వారికే దక్కుతుంది’’ అని రోహిత్ పేర్కొన్నారు. 

టీమిండియాతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. భారత్ 400 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 91 పరుగులకే కుప్పకూలిపోవడంతో భారత్‌ విజయఢంకా మోగించింది.

  • Loading...

More Telugu News