Governor: ఏపీకి కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి

center appointes new governers to several states
  • పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం
  • ఆంధ్రప్రదేశ్ కు జస్టిస్ అబ్దుల్ నజీర్.. మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్ బియాస్
  • బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ గఢ్ కు బదిలీ
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. ఏపీ ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ గఢ్ కు బదిలీపై పంపింది. కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ను రాష్ట్రానికి పంపించింది. అయోధ్య కేసుతో పాటు ట్రిపుల్ తలాఖ్ కేసులు విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు. బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఇటీవల కోరిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్థానంలో రమేష్ బైస్ ను కొత్త గవర్నర్ గా నియమించింది.

ఏయే రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిందంటే..
  • అరుణాచల్ ప్రదేశ్  గవర్నర్ గా లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్
  • ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్  
  • ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్
  • మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్ బైస్       
  • సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
  • లడఖ్ గవర్నర్ గా బి.డి. మిశ్రా
  • ఝార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్
  • అస్సాం గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియా
  • హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రసాద్ శుక్లా
  • మణిపూర్ గవర్నర్ గా అనసూయ
  • నాగాలాండ్ గవర్నర్ గా గణేషన్
  • మేఘాలయ గవర్నర్ గా చౌహాన్
  • బీహార్‌ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌
Governor
new appointments
ap governor
former judge
Maharashtra
Andhra Pradesh

More Telugu News