Magunta Raghva Reddy: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవరెడ్డికి 10 రోజుల ఈడీ కస్టడీ
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఊపందుకున్న ఈడీ దర్యాప్తు
- ఇటీవల పలువురి అరెస్ట్
- ఢిల్లీలోని కార్యాలయంలో రాఘవరెడ్డిని ప్రశ్నించిన ఈడీ
- అనంతరం అరెస్ట్
- నేడు కోర్టులో హాజరు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ఊపందుకుంది. ఈ కేసులో అరెస్టయిన మాగుంట రాఘవరెడ్డిని ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాఘవరెడ్డిని 10 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతించింది. కస్టడీ సమయంలో రాఘవను ప్రతిరోజు గంట పాటు కలిసేందుకు కుటుంబ సభ్యులకు వెసులుబాటు కల్పించింది.
మాగుంట రాఘవరెడ్డి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు. సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో రాఘవరెడ్డి పాత్ర ఉందని ఈడీ నిర్ధారించింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రాఘవరెడ్డిని ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేసింది. ఈ కేసులో రాఘవరెడ్డిని సీబీఐ కూడా గతంలో ప్రశ్నించింది.