Chandrababu: చంద్రబాబును కలిసిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు

Veligonda project expatriates met Chandrababu

  • చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన రైతులు
  • ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని వెల్లడి
  • రూ.18 లక్షల పరిహారం చెల్లించనేలేదని వివరణ

పెద్దారవీడు మండలానికి చెందిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ప్రాజెక్టు నిర్వాసితులైన తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.18 లక్షల పరిహారం ఇస్తామని వైసీపీ ఇచ్చిన హామీని విస్మరించిందని వారు వివరించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ, 2004 తర్వాత కాంగ్రెస్ హయాంలో పనులు జరగలేదని అన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం చేశామని వెల్లడించారు. మిగిలిన 10 శాతం పనులు కూడా జగన్ పూర్తిచేయలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజితో పాటు అన్ని విధాలా న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Chandrababu
Veligonda Project
Expatriates
Farmers
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News