Ola: ఓలా నుంచి మరో కొత్త ఈ-స్కూటర్.. ధర ఎంతంటే..!

Ola S1 And S1 Air new variants launched in India Prices start from Rs 84999

  • ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ఎయిర్ పేరుతో మార్కెట్లోకి విడుదల
  • స్కూటర్ ప్రారంభ ధర రూ.84,999 
  • 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో ఎస్ 1 స్కూటర్

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఖరీదులో దాదాపు సమానంగా ఉండడం, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో టూవీలర్ మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి.

తాజాగా ఓలా కంపెనీ కూడా సరికొత్త ఈ-స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఓలా ఎస్ 1 ఎయిర్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన ఈ స్కూటర్ ఖరీదు రూ.84,999 ల నుంచి మొదలవుతుందని, గరిష్ఠంగా రూ.1,09,999 ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే దాదాపు 85 కిలోమీటర్ల నుంచి 165 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ చెబుతున్నారు. 

ప్రస్తుతం ఈ స్కూటర్ ను 3 వేరియంట్లలో తీసుకొచ్చినట్లు వివరించారు. ఇందులో సరికొత్తగా 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్ ఉందని తెలిపారు. రోజూ తక్కువదూరం ప్రయాణించే వారి కోసం.. అంటే రోజూ 20 నుంచి 30 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ స్కూటర్ (ఓలా ఎస్ 1) ను డిజైన్ చేశామన్నారు. దీని ఖరీదు రూ.99,999 మాత్రమేనని, ఒక్కసారి చార్జ్ చేసి 91 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని భవీష్ చెప్పారు.

More Telugu News