DG Sunil Kumar: డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ కు లేఖ రాసిన డీవోపీటీ

DOPT wrote AP CS to take action on DG Sunil Kumar

  • సునీల్ కుమార్ విద్వేష ప్రసంగాలు చేశారన్న రఘురామ
  • డీవోపీటీ కార్యదర్శికి గతంలో ఫిర్యాదు
  • సునీల్ కుమార్ పై చర్యల పట్ల నివేదిక ఇవ్వాలన్న డీవోపీటీ
  • ఏపీ సీఎస్ కు లేఖ పంపిన కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ 

గతంలో ఏపీ సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన డీజీ సునీల్ కుమార్ వ్యవహారంపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై కేంద్రం స్పందించింది. డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సీఎస్ కు డీవోపీటీ లేఖ రాసింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ సంజీవ్ కుమార్ ఏపీ సీఎస్ కు లేఖ పంపారు. 

సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని రఘురామకృష్ణరాజు గతంలో తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికగా డీజీ విద్వేష వ్యాఖ్యలు చేశారని వివరించారు. అప్పట్లో రఘురామ డీవోపీటీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.

DG Sunil Kumar
DOPT
AP CS
CID
Andhra Pradesh
  • Loading...

More Telugu News