Raveena Tandon: హీరో అక్షయ్ కుమార్ తో ఎంగేజ్ మెంట్ బ్రేక్ కావడంపై రవీనా టాండన్ స్పందన

Raveena Tandon comments on love with Akshay Kumar
  • 90లో రవీనా టాండన్, అక్షయ్ కుమార్ ల ప్రేమాయణం
  • ఇద్దరం నిశ్చితార్థం చేసుకున్నామన్న రవీనా
  • ఆ తర్వాత ఇద్దరం చెరో దారి చూసుకున్నామని వెల్లడి
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సినీ నటి రవీనా టాండన్ల మధ్య ఆ రోజుల్లో కొనసాగిన ప్రేమాయణం సినీ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. అయితే, చాలా కథల మాదిరే ఈ ప్రేమకథ కూడా చివరకు పెళ్లిపీటలకు ఎక్కకుండానే ముగిసింది. ఇద్దరూ విడిపోయారు. ఇప్పటి వరకు దీనిపై ఏనాడూ కూడా వీరు స్పందించలేదు. తాజాగా ఈ అంశంపై రవీనా స్పందించారు. ఆరోజుల్లో తమ గురించి మీడియాలో రాస్తున్న కథనాలను కూడా తాను చదివేదాన్ని కాదని చెప్పారు. అంతే కాదు తమ బ్రేకప్ ను విడాకులతో కూడా ఆమె పోల్చారు. 

తాను, అక్షయ్ ఇద్దరం కలిసి 1994లో వచ్చిన 'మొహ్రా' సినిమాలో నటించామని రవీనా తెలిపారు. అప్పట్లో తమ జంట చాలా ఫేమస్ అని... 90లలో నిశ్చితార్థం కూడా చేసుకున్నామని.. ఆ సమయంలో ఏం జరిగిందో గుర్తు లేదు కానీ... ఇద్దరం చెరో దారి చూసుకున్నామని చెప్పారు. ఆయన మరొకరితో డేటింగ్ లో పడ్డాడని, తాను కూడా ఒకరితో డేటింగ్ చేశానని తెలిపారు. ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నప్పుడు ఇద్దరి మధ్య జెలసీ ఎందుకు వస్తుందని ప్రశ్నించింది. ఇప్పటికీ తమది హిట్ పెయిరేనని... ఇద్దరం అప్పుడప్పుడు కలుసుకుంటామని, మాట్లాడుకుంటామని చెప్పింది.
Raveena Tandon
Akshay Kumar
Bollywood
Love

More Telugu News