Narendra Modi: రోటీ చేసిన బిల్ గేట్స్ కు ప్రధాని మోదీ సూచన

Modi advice to  Bill Gates

  • సెలెబ్రిటీ  చెఫ్ ఐటన్ బెర్నాత్ తో కలిసి రోటీ చేసిన బిల్ గేట్స్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • గేట్స్ పై ప్రశంసలు కురిపించిన మోదీ

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చెఫ్ గా మారి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. భారతీయ వంటకమైన రోటీని తయారు చేశారు. సెలబ్రిటీ చెఫ్ ఐటన్ బెర్నాత్ తో కలిసి ఆయన ఒక కుకరీ వీడియో చేశారు. ఇందులో ఆయన రోటీ తయారు చేశారు. ఇద్దరూ కలిసి రోటీని రుచి చూశారు. 

ఈ వీడియోను గేట్స్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇటీవల భారత్ లో బెర్నాత్ పర్యటించాడని... బీహార్ లో గోధుమ రైతులను కలిసి వారి నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నాడని చెప్పారు. దీదీకా రసోయ్ కమ్యూనిటీ క్యాంటీన్ లోని మహిళలతో మాట్లాడాడని... వారి నుంచి రోటీలు ఎలా చేయాలో నేర్చుకున్నాడని తెలిపారు. ఇప్పుడు తామిద్దరం కలిసి రోటీని తయారు చేశామని చెప్పారు. 

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఇండియాలో తృణధాన్యాల (మిల్లెట్స్) ట్రెండ్ నడుస్తోందని, ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివని, వీటితో ఎన్నో వంటకాలను చేయొచ్చని, వీటిని మీరు కూడా ట్రై చేయండని సూచించారు. నవ్వుతున్న ఎమోజీని జత చేశారు.

Narendra Modi
BJP
Bill Gates
Roti
  • Loading...

More Telugu News