Chiranjeevi: ఆయనతో నాది తండ్రీకొడుకుల అనుబంధం: చిరంజీవి భావోద్వేగం
![Chiranjeevi emotional tweet on K Vishwanath](https://imgd.ap7am.com/thumbnail/cr-20230203tn63dc91395a605.jpg)
- పితృ సమానులైన విశ్వనాథ్ ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందన్న చిరంజీవి
- తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంస
- విశ్వనాథ్ కీర్తి అజరామరమైనదన్న మెగాస్టార్
కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన రోజు అని అన్నారు. పితృ సమానులైన ఆయన ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ఆయన గొప్పదనాన్ని చెప్పటానికి మాటలు చాలవని అన్నారు. పండితులను, పామరులను కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైనదని చెప్పారు. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలింలను కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మలిచిన దర్శకుడు ఇంకొకరు లేరని అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహాదర్శకుడు అని కొనియాడారు.