Dhanush: 100 కోట్ల బడ్జెట్ తో రూపొందే సినిమాలో సాయిపల్లవి!

Sai Pallavi in Dhanush Movie

  • హీరోయిన్ గా సాయిపల్లవి రూటు సెపరేటు 
  • విభిన్నమైన పాత్రల వైపు మాత్రమే మొగ్గుచూపే నటి 
  • ధనుశ్ 50వ సినిమాలో దక్కిన ఛాన్స్ 
  • అజిత్ మూవీలోను కీలకమైన రోల్ అంటూ టాక్   

సాయిపల్లవిని అభిమానించని ప్రేక్షకులు గానీ .. ఆమె నటనను ఇష్టపడని ప్రేక్షకులు గానీ దాదాపుగా ఉండరు. అందుకు కారణం ఆమె ఎంచుకునే కథలు .. పాత్రలు అనే చెప్పాలి. గతంలో సాయిపల్లవి మాదిరిగా సహజమైన నటనను ఆవిష్కరించిన కథానాయికలు ఉన్నారు. అలాగే స్కిన్ షో చేయకుండా నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే చేసినవారున్నారు. 

అయితే అలాంటి నటనతో పాటు డాన్స్ విషయంలో తన ప్రత్యేకతను సాయిపల్లవి చాటుకుంది. అలాంటి సాయిపల్లవి 'విరాటపర్వం' సినిమా తరువాత తెలుగులో కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోలేదు. దాంతో ఆమె పెళ్లి ఆలోచనలో ఉందనే ఒక ప్రచారం ఊపందుకుంది. అయితే సరైన కథలు రాకపోవడం వల్లనే ఆమె చేయడం లేదనేది తాజా సమాచారం.

తమిళంలో తాజాగా సాయిపల్లవి రెండు ప్రాజెక్టులను ఒప్పుకుందని చెబుతున్నారు. ధనుశ్ 50వ సినిమాలో కథానాయికగా ఆమెను తీసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక అజిత్ - విఘ్నేశ్ శివన్ సినిమాలోను ఒక కీలకమైన రోల్ చేయడానికి సాయిపల్లవి అంగీకరించిందని అంటున్నారు. ఇక తేలాల్సింది ఆమె తెలుగు సినిమాల గురించే!

More Telugu News