Mukesh Ambani: భారతీయ కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీకే కిరీటం

Mukesh Ambani overtakes Gautam Adani as richest Indian Forbes

  • ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో మారిపోయిన స్థానాలు
  • నేడు కూడా అదానీ షేర్లకు నష్టాలు
  • ఫలితంగా మారిపోయిన నికర సంపద విలువ  

అదానీ గ్రూపు షేర్లు బుధవారం కూడా బిక్క మొహం వేశాయి. 2-10 శాతం మధ్య గ్రూపు కంపెనీల షేర్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ విల్ మార్ 5 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ 5 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం వరకు నష్టాలతో కొనసాగుతున్నాయి. దీంతో ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీని రిలయన్స్ సామ్రాజ్యాధినేత ముకేశ్ అంబానీ వెనక్కి నెట్టేశారు. 

దేశీయ అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ అవతరించారు. ఇది రియల్ టైమ్ జాబితా ఏ రోజుకారోజు మారిపోతుంటుంది. అదానీ కంపెనీల షేర్లు గత కొన్ని రోజులుగా హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా నష్టపోతుండడం తెలిసిందే. నెల క్రితం గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు అదానీ షేర్లను పడవేశాయి. ఫలితంగా అదానీ నికర సంపద విలువ తగ్గిపోయింది. దీంతో బిలియనీర్ల జాబితాలో స్థానాలు తారుమారయ్యాయి. 

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల తాజా జాబితాలో ముకేశ్ అంబానీ 84.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 9వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ 84.3 బిలియన్ డాలర్లతో 10వ స్థానంలో ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, కార్లోస్ స్లిమ్, లారీ పేజ్ వీరి కంటే ముందు స్థానాల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News