GVL: ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

GVL reacts on CM Jagan comments over AP Capital

  • ఏపీ రాజధాని అంశంపై ఢిల్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలు
  • ఏపీ సీఎం రాజకీయ కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారన్న జీవీఎల్
  • విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి జరగదని వెల్లడి

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. సుప్రీంకోర్టును అవమానించేలా జగన్ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఏపీ సీఎం రాజకీయ కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని వివరించారు. సమష్టి నిర్ణయంతో అమరావతిని రాజధానిగా తీర్మానించారని వెల్లడించారు.

ఐటీ హబ్ గా విశాఖకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును స్వాగతిస్తున్నామని జీవీఎల్ తెలిపారు. ఇక, బీఆర్ఎస్ అంటే వైసీపీకి భయమా, స్నేహమా? బీఆర్ఎస్ తో లాలూచీనా? రాజకీయ మైత్రి కొనసాగిస్తున్నారా? అని ప్రశ్నించారు.

GVL
Jagan
Visakhapatnam
AP Capital
BJP
YSRCP
  • Loading...

More Telugu News