Nagababu: పవన్ కల్యాణ్ కి ఆదాయం కంటే .. అప్పులు ఎక్కువ: నాగబాబు

Nagababu Interview

  • పవన్ దగ్గర డబ్బులు లేవన్న నాగబాబు  
  • ఆ 8 ఎకరాలే అతని ఆస్తి అని వెల్లడి 
  • ఇల్లు .. కార్లు కొన్నది లోన్ లోనే అని వివరణ

మెగా ఫ్యామిలీని గురించి ఎవరైనా ఏమైనా అంటే ముందుగా నాగబాబు స్పందిస్తారు. కామెంట్ చేసినవారికి వెంటనే ఆయన కౌంటర్ ఇస్తుంటారు. అందుకే, చిరంజీవి .. పవన్ జోలికి వెళ్లాలనుకున్నవారు ముందుగా నాగబాబును చూసి జంకుతుంటారు. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయం ప్రస్తావనకు రాగా ఆయన తనదైన శైలిలో స్పందించారు.

"అన్నయ్యను .. తమ్ముడిని చాలా దగ్గరగా చూసినవాడిని నేను. సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఉన్నవారు. అందుకోసం తమ డబ్బును కోట్లలో ఖర్చు చేస్తున్నారు. కల్యాణ్ బాబు విషయానికొస్తే తన ఆదాయం కంటే అప్పులు ఎక్కువగా ఉంటాయి. కల్యాణ్ బాబు దగ్గర డబ్బులు లేవు. మళ్లీ అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఆయన. ఇల్లు కూడా లోన్ తీసుకుని కట్టుకున్నదే .. కార్లు కూడా అంతే" అని అన్నారు. 

"పవన్ తాను సంపాదించిందంతా ప్రజల కోసం .. పార్టీ కోసం .. అవసరమై అడిగినవారి కోసం ఇచ్చేస్తూ ఉంటాడు. పవన్ కి వ్యవసాయం చేయడమంటే ఇష్టం .. అందువలన శంకర్ పల్లిలో 8 లక్షలు పెట్టి అప్పట్లో 8 ఎకరాలు కొన్నాడు. అతనికి ఉన్న ఆస్తి అదొక్కటే. అది ఇప్పుడు రేటు పెరిగితే పెరగాలి తప్ప .. అంతకుమించి అతనికి ఏమీ లేదు" అంటూ చెప్పుకొచ్చారు.

Nagababu
Chiranjeevi
Pavan Kalyan
  • Loading...

More Telugu News