Raja Singh: చావైనా, బతుకైనా ధర్మం కోసమే పోరాడతా: రాజాసింగ్

Raja Singh comments on police notices

  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళహాట్ పోలీసుల నోటీసులు
  • మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు
  • రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలన్న పోలీసులు
  • తాను అన్నింటికీ సిద్ధంగా ఉన్నానన్న రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మత విద్వేషాలు రగిల్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ ఈ నోటీసులు ఇచ్చారు. రెండ్రోజుల్లో నోటీసులపై స్పందించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు రాజాసింగ్ కు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియో సందేశం వెలువరించారు. 

"లవ్ జిహాద్ పైనా, మతమార్పిళ్లపైనా, గో హత్యలపైనా చట్టం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నా. నేను పాల్గొన్న కార్యక్రమం కూడా మహారాష్ట్రలో జరిగింది... మీకెందుకు బాధ? నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నాకు మంచి జీవితం లభించింది. ఇప్పుడు నాది ఒకటే లక్ష్యం... ధర్మం గురించి చావాలి, ధర్మం గురించి బతకాలి! మీరు జైలుకు పంపిస్తారా, తెలంగాణ నుంచి తరిమేస్తారా... ఏంచేస్తారో చూస్తాను... నేను సిద్ధంగా ఉన్నాను" అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

More Telugu News