nitish kumar: పార్టీ నుంచి వెళ్లిపోమన్న నితీశ్ కుమార్.. ‘వాటా’ అడిగిన ఉపేంద్ర కుష్వాహా

nitish kumar asks upendra kushwaha to quit jdu

  • బీజేపీతో ఉపేంద్ర కుష్వాహా టచ్ లో ఉంటున్నారని వార్తలు
  • జేడీయూ నుంచి వెళ్లిపోవాలన్న నితీశ్ కుమార్
  • తన వాటాను వదిలేసి పార్టీ నుంచి ఎలా బయటికి వెళ్లగలనంటూ కుష్వాహా ట్వీట్ 

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కు... సొంత పార్టీ సీనియర్ నేత ఉపేంద్ర కుష్వాహాకు మధ్య గొడవ తారస్థాయికి చేరింది. పార్టీకి, పార్లమెంటరీ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా కుష్వాహాను నితీశ్ ఆదేశించారు. కానీ అందుకు ఒప్పుకోని ఉపేంద్ర కుష్వాహా.. తన ‘వాటా’ తనకు దక్కందే పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.

‘‘బాగా చెప్పారు అన్నగారూ. అన్నల సలహా మేరకు తమ్ముళ్లు ఇలాగే ఇంట్లోంచి వెళ్లిపోతుంటే.. అన్నలంతా తమ్ముళ్లను వెళ్లగొట్టి పూర్వీకుల ఆస్తి మొత్తం లాక్కునేవాళ్లు. మరి మొత్తం ఆస్తుల్లో నా వాటాను వదిలేసి నేను ఎలా (పార్టీ నుంచి) బయటికి వెళ్లగలను?’’ అని ఉపేంద్ర కుష్వాహా ట్వీట్ చేశారు.

బీజేపీతో ఉపేంద్ర టచ్ లో ఉంటున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేయాలంటూ ఆయన్ను నితీశ్ ఆదేశించారు. అందుకు నిరాకరించిన కుష్వాహా.. వాటా పేరుతో ట్వీట్ చేయడంతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది.

nitish kumar
upendra kushwaha
jdu
bjp
bihar
  • Loading...

More Telugu News