Srinivasa Murthy: అజిత్, సూర్య, విక్రమ్ వంటి స్టార్లకు డబ్బింగ్ చెప్పే శ్రీనివాసమూర్తి హఠాన్మరణం

Dubbing artist Srinivasa Murthy passes away

  • గుండెపోటుతో మృతి చెందిన శ్రీనివాసమూర్తి
  • చెన్నైలో నివాసం ఉంటున్న వైనం
  • చిన్న వయసులోనే మృతి చెందడంపై సినీ ప్రముఖుల ఆవేదన

టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సీనియర్ నటి జమున కన్నుమూశారనే వార్తతో సినీ పరిశ్రమ ఇప్పటికే విషాదంలో మునిగిపోయింది. ఇంతలోనే మరో చేదు వార్త ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కన్నుమూశారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆయన గుండెపోటుతో ఈ రోజు మృతి చెందారు. 

తన గంభీరమైన స్వరంతో అజిత్, సూర్య, మోహన్ లాల్, విక్రమ్, రాజశేఖర్ వంటి స్టార్లకు ఎన్నో ఏళ్లుగా ఆయన డబ్బింగ్ చెపుతున్నారు. అజిత్ తాజా చిత్రం 'తెగింపు'లో కూడా ఆయనే డబ్బింగ్ చెప్పారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News