Srikakulam District: అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి.. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే విషాదం

Srikakulam Man Dies In America  Who Went 10 days ago
  • ఈ నెల 17న అమెరికా వెళ్లిన రవికుమార్
  • మూడు రోజుల క్రితం సీమన్‌గా ఉద్యోగంలో చేరిక
  • కంటెయినర్‌ పైనుంచి జారిపడి మృతి
  • సంతబొమ్మాలి మండలం ఎం.సున్నాపల్లిలో విషాదం
ఉపాధి కోసం అమెరికా వెళ్లి ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే శ్రీకాకుళం జిల్లా యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన టి. రవికుమార్ (35) నౌకలో పనిచేసేందుకు మరో 10 మందితో కలిసి ఈ నెల 17న అమెరికా వెళ్లాడు. మూడు రోజుల క్రితం అక్కడ సీమన్‌గా ఉద్యోగంలో చేరాడు. 

బుధవారం సాయంత్రం విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు కంటెయినర్‌ పైనుంచి జారిపడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్నికుటుంబ సభ్యులకు తెలియజేశారు. రవికుమార్‌కు భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
Srikakulam District
Santhabommali
America
Andhra Pradesh

More Telugu News