రూ. 21 వేల కోట్లను దారి మళ్లించారు: పవన్ కల్యాణ్
- ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్ష ఎదుర్కొంటారన్న పవన్
- ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను తొలగించారని ఆరోపణ
- వైసీపీ ప్రభుత్వ పబ్లిసిటీ కోసం రూ. 15 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శ
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించకూడదని పవన్ చెప్పారు. బయట ఉండే శత్రువుల కంటే... మనతో ఉండే శత్రువులతోనే ప్రమాదం ఎక్కువని చెప్పారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను తీసేశారని చెపుతుంటే బాధేస్తోందని అన్నారు. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. ఈ మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన రూ. 20 వేల కోట్లను రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లను ఖర్చు చేసిందని... వైసీపీ రంగుల కోనం రూ. 21,500 కోట్లను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. నిధులను దారి మళ్లించి ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని దుయ్యబట్టారు.