ఉపేంద్ర హీరోగా 'కబ్జా' .. రిలీజ్ డేట్ ఖరారు!
- ఉపేంద్ర హీరోగా రూపొందిన 'కబ్జ'
- కీలకమైన పాత్రలో కిచ్చా సుదీప్
- భారీ తారాగణంతో నిర్మితమైన సినిమా
- ప్రపంచవ్యాప్తంగా మార్చి 17వ తేదీన విడుదల
ఆయన తాజా చిత్రంగా 'కబ్జ' రూపొందింది. పోస్టర్స్ దగ్గర నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళుతోంది. ఆనంద్ పాండియన్ నిర్మించిన ఈ సినిమాకి చంద్రు దర్శకత్వం వహించాడు. కిచ్చా సుదీప్ .. శ్రియ ఇతర ప్రధానమైన పాత్రలలో నటించారు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చాడు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 17వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. కోట .. పోసాని .. సముద్రఖని .. మురళీశర్మ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించనుంది
.