cheguvera: హైదరాబాద్ వచ్చిన చేగువేరా కూతురు, మనుమరాలు

cheguvera daughter in hyderabad

  • నేడు రవీంద్రభారతిలో క్యూబా సంఘీభావ సభ
  • హాజరుకానున్న అలైదా గువేరా, ఎస్తేఫానియా గువేరా
  • రవీంద్రభారతి వద్ద భారీ సంఖ్యలో స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు

క్యూబా విప్లవ యోధుడు చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్ వచ్చారు. కోల్ కతా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనుమరాలు, ప్రొఫెసర్ ఎస్తేఫానియా గువేరా కూడా వచ్చారు. వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు.

ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా, ఎస్తేఫానియా ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ సభలో బీజేపీ, ఎంఐఎం తప్ప మిగతా పార్టీలకు చెందిన నేతలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ సభను విజయవంతం చేయాలని క్యూబా తెలంగాణ కమిటీ కో ఆర్డినేటర్లు పిలుపునిచ్చారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా అలైదా, ఎస్తెఫానియా సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దుంభవన్ కు వెళ్లనున్నట్లు తెలిసింది. సభ జరిగే రవీంద్రభారతి వద్ద చేగువేరా కూతురు, మనవరాలికి స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు.

cheguvera
estefania guevara
Aleida Guevara
hyderabad
ravindra bharathi
  • Loading...

More Telugu News