Bengaluru: బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు అలాంటివి మరి.. కల్యాణ మండపానికి మెట్రోలో వెళ్లిన పెళ్లి కూతురు!

Bengaluru Bride takes metro on her wedding day

  • కారులో వెళ్తే ముహూర్తం సమయానికి చేరుకోలేనని భావించిన వధువు
  • కారు దిగి మెట్రో ఎక్కిన పెళ్లి కూతురు
  • పెళ్లి కుమార్తె ముస్తాబులో, ఒంటినిండా నగలు ధరించి రైలులో ప్రయాణం
  • ‘స్మార్ట్ పెళ్లి కూతురు’ అంటూ ప్రశంసలు

బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు అట్లుంటయ్ మరి! ఈ వీడియో చూస్తే ఎవరైనా ఇలా అనుకోవాల్సిందే. కల్యాణ మండపానికి కారులో బయలుదేరిన వధువు ట్రాఫిక్ కష్టాలకు భయపడి మధ్యలోనే కారు దిగి మెట్రో ఎక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండడంతో ముహూర్తం సమయానికి కల్యాణ మండపానికి చేరుకోలేనని భావించిన వధువు పెళ్లి కూతురు ముస్తాబులోనే మెట్రో ఎక్కేసింది. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి రైలెక్కిన ఆమెను చూసిన ప్రయాణికులు నోరెళ్లబెట్టారు.  

ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేందుకు యువతి సమయస్ఫూర్తిగా ఆలోచించిందటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. ‘స్మార్ట్ పెళ్లికూతురు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరు ఆమెను ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం ముహూర్తం సమయానికే బయలుదేరడం ఏంటని, సమయపాలన అస్సలు లేదని ఆమెను విమర్శిస్తున్నారు. కల్యాణ మండపానికి చేరుకుని, పెళ్లి పీటలపై కూర్చోవడం కూడా ఆ వీడియోలో కనిపించింది.

Bengaluru
Bride
Metro Rail
Wedding
Bengaluru Traffic
  • Loading...

More Telugu News