Kanchana: ఆస్తుల కోసమే నాకు పెళ్లి కాకుండా చేశారు: సీనియర్ నటి కాంచన

Kanchana Interview

  • అలనాటి తారగా వెలుగొందిన కాంచన
  • ఇంటికోసం ఎన్నో కష్టాలు పడ్డానని వెల్లడి 
  • తల్లిదండ్రులలో మార్పు కోసం వెయిట్ చేశానని వ్యాఖ్య 
  • సహనంతో ఉండటం పొరపాటైందని ఆవేదన     

తెలుగు తెరపై గ్లామరస్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాంచన వయసు ఇప్పుడు 80కి పైనే. వివాహం చేసుకోకుండా అయినవారి ఆశ్రయంలోనే ఉంటూ, ఆమె భగవంతుడి నామస్మరణతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. తనకి ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఆ భగవంతుడే చూసుకుంటున్నాడంటూ ఆమె అపారమైన విశ్వాసాన్ని చాటుతున్నారు. 

తాజా ఇంటర్వ్యూలో కాంచన మాట్లాడుతూ .. "ఎవరికోసమైతే ఇంటికి కొడుకుగా మారిపోయి కష్టపడి సంపాదించానో, ఆ తల్లిదండ్రులే నన్ను ఆదుకోలేదు .. ఆదరించలేదు అని అంతా అనుకుంటున్నారు .. అది నిజమే. నా ఆస్తుల కోసం నాకు పెళ్లికాకుండా చేశారనేది కూడా నిజమే. నా జీవితంలో హార్ట్ ఎటాక్ వచ్చి పోవలసిన కష్టాలు ఎన్నో వచ్చాయి .. అయినా తట్టుకుని నిలబడ్డాను" అని అన్నారు. 

"మా మాటను మించి వేరే వారి మాటలను నమ్మే పరిస్థితుల్లో అప్పట్లో అమ్మానాన్నలు ఉన్నారు. ఆ సమయంలో నిలదీయకపోవడం .. నేను చెప్పింది వినవలసిందే అనే ఒక ధోరణి చూపించకుండా సహనంతో సర్దుకుపోవడం నేను చేసిన తప్పు. మారతారేమోనని ఎదురుచూడటం పొరపాటైంది. ఎవరు చేసిన కర్మను వారు అనుభవించక తప్పదు. భగవంతుడు తన పాదాలు పట్టుకుంటే అంతా తానే చూసుకుంటానని అంటాడు. ఇప్పుడు నేను చేస్తున్నది అదే" అంటూ చెప్పుకొచ్చారు.

Kanchana
Actress
Tollywood

More Telugu News