Pakistan: హానీట్రాప్​ లో పాక్ కెప్టెన్ బాబర్.. ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు వైరల్!

Pakistan skipper Babar Azam caught in honey trap
  • సహచర క్రికెటర్ ప్రేయసితో లైంగిక సందేశాలు పంపినట్టు ప్రచారం
  • తనతో ఇలానే చాట్ చేస్తే ఆమె ప్రియుడు జట్టులోనే ఉంటాడని భరోసా!
  • బాబర్ ఫొటోలు మార్ఫింగ్ చేశారంటున్న అతని అభిమానులు
పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ హానీట్రాప్ కు గురైనట్టు తెలుస్తోంది. అతనికి సంబంధించిన పలు ప్రైవేట్ వీడియోలు, ఆడియో రికార్డింగ్స్, ఫొటోలు, మహిళతో చేసిన చాంటింగ్ స్ర్కీన్ షాట్లు నెట్ లో ప్రత్యక్షం కావడంతో సంచలనం రేగింది. పాకిస్థాన్ కు చెందిన తోటి క్రికెటర్ ప్రియురాలికి బాబర్ లైంగిక సందేశాలు పంపించాడనే ఆరోపణలు వస్తున్నాయి. తనతో ఇలానే సెక్స్ చాటింగ్ చేస్తుంటే.. నీ ప్రియుడు జట్టు నుంచి ఎప్పటికీ బయటికి వెళ్లడంటూ సదరు మహిళకు బాబర్ హామీ ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
దాంతో, బాబర్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే, వీడియోలు, ఫొటోల్లో ఉన్నది బాబర్ కాదని అతని మద్దతుదారులు చెబుతున్నారు. గిట్టని వాళ్లు మార్ఫింగ్ చేసి వీటిని సోషల్ మీడియాలో షేర్ చేశారని ఆరోపిస్తున్నారు. మరికొందరు బాబర్ నిజంగానే హనీట్రాప్ కు గురై ఉంటాడని భావిస్తున్నారు. వీటిపై పాక్ కెప్టెన్ ఇంకా స్పందించలేదు.
Pakistan
Cricket
babar azam
honeytrap

More Telugu News