Hyderabad: హైదరాబాద్ లో ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య

all family members commits suicide in hyderabad

  • హబ్సిగూడలో అపార్ట్ మెంట్ లో విషాదకర ఘటన
  • మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి
  • కుటుంబ కలహాలే కారణమనే అనుమానం

హైదరాబాద్ లోని హబ్సిగూడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతి చెందిన వారిలో దంపతులతో పాటు మరో మహిళ, నాలుగేళ్ల బాలిక ఉన్నారు. మృతులను ప్రతాప్ (34), సింధూర (32), ఆద్య (4), ప్రతాప్ తల్లిగా గుర్తించారు. చెన్నైలోని బీఎండబ్ల్యూ కార్ల షోరూమ్ లో ప్రతాప్ డిజైనర్ మేనేజర్ గా పని చేస్తున్నారు. సింధూర హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యలకు కారణమని భావిస్తున్నారు. తొలుత ఆద్యకు ఉరి వేసి, ఆ తర్వాత కుటుంబం అంతా ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది.

Hyderabad
Family
Suicide
  • Loading...

More Telugu News