Anupama parameshvaran: అనుపమ బ్యూటిఫుల్ లుక్స్ .. లేటెస్ట్ పిక్స్!

Anupama Beautiful  Looks

  • యూత్ లో అనుపమకి మంచి ఫాలోయింగ్
  • నటన ప్రధానమైన పాత్రలవైపే మొగ్గు  
  • ఈ ఏడాది రెండు హిట్లతో ఫుల్ ఖుషి
  • అనుపమ అందానికి అద్దం పడుతున్న పిక్స్ 

ఒక నిత్యామీనన్ .. ఒక సాయిపల్లవి తరహాలోనే, నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే ఒప్పుకునే హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తుంది. 2015లోనే తన కెరియర్ ను ప్రారంభించిన అనుపమ, 'అ ఆ' .. 'శతమానం భవతి' వంటి మంచి హిట్స్ ను అందుకుంది. అలాంటి అనుపమ నుంచి ఆమె లేటెస్ట్ పిక్స్ వచ్చాయి. రెడ్ కలర్ డ్రెస్ లో ఎర్ర కలువలా ఆమె ఆకట్టుకుంటోంది. అల్లరి కళ్లతో .. కొంటె చూపులతో .. మనోహరమైన నవ్వుతో కళ్లను కట్టిపడేస్తోంది. ప్రతి స్టిల్ కూడా పడుచు మనసులకు గిలిగింతలు పెట్టేలా ఉంది .. కుర్రకారు కలల తలుపులు తెరిచేలా ఉంది. అందాల అనుపమకు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆమె నుంచి వచ్చిన 'కార్తికేయ 2' 100 కోట్ల క్లబ్ లోకి ఆమె అడుగుపెట్టేలా చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన '18 పేజెస్' సినిమా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన 'బటర్ ఫ్లై'కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

Anupama parameshvaran
Actress
Tollywood
  • Loading...

More Telugu News