Balakrishna: గోపీచంద్ మలినేనికి కన్నీళ్లు .. ఓదార్చిన బాలయ్య

Unstoppable 2 Update

  • 'వీరసింహారెడ్డి'తో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని 
  • రెండేళ్ల పాటు కష్టాలు పడ్డానంటూ ఎమోషనల్ 
  • ఓదార్పుగా భుజం తట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ 
  • ఇకపై కన్నీళ్లు రావు .. కాసులే వస్తాయంటూ దగ్గరికి తీసుకున్న బాలయ్య  

బాలయ్య 'అన్ స్టాపబుల్ 2' వేదికపై 'వీరసింహా రెడ్డి' టీమ్ సందడి చేసింది. ముందుగా గోపీచంద్ మలినేని .. వరలక్ష్మి శరత్ కుమార్ స్టేజ్ పైకి వచ్చారు. వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాల్లోకి రావడం గురించి .. ఆమె ఎంతగా కష్టపడితే ఈ రోజున ఈ స్థాయికి వచ్చిందనేది బాలకృష్ణ చెప్పారు. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టు అంటూ ఆమెను ప్రశంసించారు. 

ఆ తరువాత ఆయన గోపీచంద్ మలినేని పడిన స్ట్రగుల్స్ గురించి అడిగారు. అందుకు గోపీచంద్ మలినేని స్పందిస్తూ .. 'క్రాక్' సినిమాకి ముందు రెండేళ్ల పాటు చాలా కష్టాలు పడ్డాను. నాకున్న కొద్ది పాటి ఆస్తులను కూడా అమ్మేశాను. ఆ సమయంలో మన శ్రేయోభిలాషులెవరు? అనే విషయం నాకు అర్థమైంది" అని అన్నారు.

"ఇండస్ట్రీలో నిలబడాలంటే సక్సెస్ ఉండాలి .. అది లేకపోతే ఎవరూ మనవెంట ఉండరు. అందువల్లనే సక్సెస్ ఎంత ముఖ్యమైనదనేది తెలుసుకున్నాను. అప్పటి నుంచి మరింత హార్డ్ వర్క్ చేయడం మొదలు పెట్టాను. ఇకపై అలాంటి కష్టాలు రావని నేను అనుకుంటున్నాను  .. ఎందుకంటే ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను" అంటూ ఎమోషనల్ అయ్యారు. ఓదార్పుగా వరలక్ష్మి శరత్ కుమార్ ఆయన భుజం తట్టారు. 

"గోపీచంద్ నా డైరెక్టర్ అంటూ బాలయ్య ఆయనను ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇకపై కష్టాలు రావు .. కన్నీళ్లు రావు .. కాసులే వస్తాయి" అంటూ గోపీచంద్ ను ఓదార్పుతో దగ్గరికి తీసుకున్నారు. ఇక ఆ తరువాత ఈ టాక్ షోలో నిర్మాతలతో పాటు దునియా విజయ్ .. హనీ రోజ్ కూడా సందడి చేశారు..

Balakrishna
Varalakshmi Sharath Kumar
Gopichand Malineni

More Telugu News