Balakrishna: నాన్నపేరు చెప్పుకుని ఒక్క సినిమా కూడా చేయలేదు: వరలక్ష్మి శరత్ కుమార్

Unstoppable 2 Update

  • తెలుగు .. తమిళ భాషల్లో బిజీగా వరలక్ష్మి శరత్ కుమార్
  • నటన అంటే తనకి ఇష్టమని వ్యాఖ్య  
  • తాను సినిమాల్లోకి రావడం తండ్రికి ఇష్టం లేదని వెల్లడి 
  • టాలెంటుతోనే నిలదొక్కుకున్నానని వివరణ 
  • హైదరాబాదుకి షిఫ్ట్ అయ్యానని చెప్పిన వరలక్ష్మి 

'అన్ స్టాపబుల్ 2' లో 'వీరసింహారెడ్డి' పాల్గొన్న ఎపిసోడ్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ వేదికపై బాలకృష్ణ - వరలక్ష్మి శరత్ కుమార్ కలిసి సందడి చేశారు. బాలయ్య అడిగిన ఓ ప్రశ్నకి వరలక్ష్మి స్పందిస్తూ .. "మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. అందువల్లనే నేను యాక్టింగ్ వైపు వెళతానని నాన్నతో చెప్పాను. ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని చెప్పేసి నాన్న వద్దన్నారు" అంది. 

"అయితే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం .. అదే చేస్తాను అని పట్టుబట్టి నాన్నను ఒప్పించాను. సినిమాల్లోకి వచ్చిన తరువాత నాకు ఫలానా ప్రాజెక్టులో ఛాన్స్ ఇప్పించమని నాన్నను ఎప్పుడూ అడగలేదు. శరత్ కుమార్ కూతురుగా కాకుండా వరలక్ష్మిగా నాకు అవకాశాలు ఇవ్వమని నేను నిర్మాతలకు చెప్పాను" అన్నారు. 

ఇంతవరకూ నేను చేసిన సినిమాలన్నీ నా టాలెంటుతో సంపాదించుకున్నవే. ఏ ఒక్క అవకాశం కూడా మా నాన్న ద్వారా రాలేదు. రావాలని నేను అనుకోలేదు. తెలుగులో నాకు 'క్రాక్' సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక్కడ వరుస ఆఫర్లు వస్తున్నాయి. అందువల్లనే ఇక్కడికే షిఫ్ట్ అయ్యాను" అని చెప్పుకొచ్చింది. 

Balakrishna
Varalakshmi Sharath Kumar
Gopichand Malineni
  • Loading...

More Telugu News