Balakrishna: నా సరసన హీరోయిన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ చేయాలి: బాలకృష్ణ

Unstoppable 2 Update

  • 'అన్ స్టాపబుల్ 2' స్టేజ్ పై వరలక్ష్మి శరత్ కుమార్ 
  • 'వీరసింహారెడ్డి'లో చెల్లెలుగా ఆమె నటనపై బాలయ్య ప్రశంసలు 
  • హీరో హీరోయిన్స్ గా చేద్దామన్న బాలయ్య 
  • అందుకు ఆనందంగా అంగీకరించిన వరలక్షి  

'ఆహా' లో 'అన్ స్టాపబుల్ 2' లో 'వీరసింహారెడ్డి' టీమ్ పాల్గొన్న ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ముందుగా బాలయ్యతో ఈ వేదికపైకి వరలక్ష్మి శరత్ కుమార్ .. గోపీచంద్ మలినేని వచ్చారు. వరలక్ష్మి మాట్లాడుతూ .. " బాలకృష్ణ గారికి కొంచెం కోపం ఎక్కువని నేను విన్నాను. ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు ఆయన నా కంటే హైపర్ అనే విషయం అర్థమైంది. ఆయనకి కోపం వస్తుంది .. అది కూడా డిసిప్లిన్ విషయంలో. మిగతా సమయాల్లో ఆయన చాలా సరదాగా ఉంటారు" అని అన్నారు. 

ఇక బాలయ్య మాట్లాడుతూ .. 'వీరసింహారెడ్డి' సినిమాలో వరలక్ష్మి చాలా గొప్పగా నటించింది. నాయకురాలు నాగమ్మ తరహా పాత్రలను చేసే ఒక నటి తెలుగు ఇండస్ట్రీకి దొరికింది. వరలక్ష్మి మల్టీ టాలెంటెడ్ .. హీరోయిన్ గా .. చిన్నపిల్లలా అనిపిస్తూ ఉంటుంది. మేమిద్దరం కలిసి హీరో హీరోయిన్లుగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను" అన్నారు. 

ఆ మాటకి వరలక్ష్మి శరత్ కుమార్ ఆనందంతో పొంగిపోయింది. తన సీట్లో నుంచి లేచొచ్చి ఆయనకి హైఫై ఇచ్చింది. "ఈ సినిమాలో నాకు విలన్ రోల్ ఇచ్చినందుకు నేను గోపీచంద్ మలినేనిపై నా కోపం చూపిస్తూనే ఉన్నాను సార్" అంటూ, ఆయనతో హీరోయిన్ గా చేయడానికి తాను రెడీ అనే విషయాన్ని చెప్పేసింది.

Balakrishna
Varalakshmi Sharath Kumar
Gopichand Malineni
  • Loading...

More Telugu News