RBI Governor: క్రిప్టో కరెన్సీని నిషేధించాల్సిందే: ఆర్బీఐ గవర్నర్

We will not allow Crypto Currency says RBI Governor
  • క్రిప్టో కరెన్సీ మొత్తం బూటకమన్న ఆర్బీఐ గవర్నర్
  • క్రిప్టో కరెన్సీ జూదంలాంటిదని వ్యాఖ్య
  • క్రిప్టోకు విలువ లేదన్న శక్తికాంతదాస్
క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ కరెన్సీ మొత్తం బూటకమేనని అన్నారు. దానికి విలువ ఉన్నట్టుగా జనాలను నమ్మిస్తున్నారని చెప్పారు. క్రిప్టో కరెన్సీ జూదంలాంటిదని, దాన్ని నిషేధించాల్సిందేనని అన్నారు. 

ఏ ఆర్థిక ఉత్పత్తికైనా, ఆస్తికైనా విలువ అనేది ఉండాలని, కానీ క్రిప్టో కరెన్సీకి విలువ లేదని చెప్పారు. క్రిప్టో కరెన్సీకి ఉన్న విలువ ఒక అభూత కల్పన అని అన్నారు. మన దేశంలో జూదానికి అనుమతి లేదని... డబ్బు పేరుతో జూదం ఆడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని చెప్పారు.
RBI Governor
Crypto Currency

More Telugu News