Rajamouli: హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టీవెన్ స్పిల్ బర్గ్ ను కలిసిన రాజమౌళి
![Rajamouli met Steven Spielberg](https://imgd.ap7am.com/thumbnail/cr-20230114tn63c244bb879ef.jpg)
- లాస్ ఏంజెలెస్ లో యూనివర్సల్ పార్టీలో పాల్గొన్న రాజమౌళి
- స్పిల్ బర్గ్ ని కలిసిన రాజమౌళి, కీరవాణి
- ఇప్పుడే దేవుడిని కలిశానన్న రాజమౌళి
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం కోసం దర్శకధీరుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులు కుటుంబ సమేతంగా అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా యూనివర్సల్ పార్టీలో రాజమౌళి, కీరవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టీవెన్ స్పిల్ బర్గ్ ను వీరు కలిశారు. స్పిల్ బర్గ్ ను వీరు కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా వీరు కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను రాజమౌళి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడే దేవుడిని కలిశానని ఆయన ట్వీట్ చేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/20230114fr63c243bf2aee0.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20230114fr63c2448c06a13.jpg)