Roja: రెండు సార్లు గెలిచిన నేను.. నీతో తిట్టించుకోవాలా?: పవన్ పై రోజా ఫైర్

Roja fires on Pawan Kalyan

  • పవన్, రోజాల మధ్య మాటల యుద్ధం
  • డైమండ్ రాణి కూడా తన గురించి మాట్లాడుతోందన్న పవన్
  • ప్రజల కోసం తిట్టించుకోక తప్పడం లేదన్న రోజా

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో పవన్ నిన్న ప్రసంగిస్తూ రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'రెండు చోట్ల ఓడిపోయినోడు అంటూ ఆ డైమండ్ రాణి రోజా కూడా నా గురించి మాట్లాడుతోందే...! నువ్వు కూడా నా గురించి మాట్లడతావా... ఛీ... నా బతుకు చెడ! ప్రజల కోసం డైమండ్ రాణితోనైనా తిట్టించుకుంటా' అని పవన్ అన్నారు.

ఈ వ్యాఖ్యలపై రోజా ట్విట్టర్ వేదికగా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. 'రెండు సార్లు గెలిచిన తాను... రెండు చోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా?' అని ప్రశ్నించారు. 'తూ... ప్రజల కోసం తప్పడం లేదు' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ ను ప్యాకేజ్ స్టార్ అని విమర్శించారు.

Roja
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News