Ambati Rambabu: నీవు కల్యాణాల పవన్ వి.. అంబటి రాంబాబు కౌంటర్

PK means Pichi Kukka says Ambati Rambabu

  • నిన్నటి సభలో వైసీపీ నేతలపై పవన్ తీవ్ర విమర్శలు
  • అంబటి రాంబాబును సంబరాల రాంబాబు అన్న పవన్
  • PK అంటే పిచ్చికుక్క అన్న మంత్రి అంబటి  

నిన్న శ్రీకాకుళం జిల్లా రంగస్థలంలో నిర్వహించిన జనసేన బహిరంగసభలో వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి ఆయన సంబరాల రాంబాబు అని విమర్శలు గుప్పించారు. 'సంబరాల రాంబాబు ఉంటాడొకడు. బాగా తెలివిగా, అన్నీ తెలిసినవాడిలా ముదురుముఖం వేసుకుని "పవన్ కల్యాణ్ గారు" అంటాడు... ఏమిటయ్యా మాటలు! ఈ పిచ్చి కూతలు ఆపేసి పనిచూడండి' అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలకు అంబటి రాంబాబు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. నేను సంబరాల రాంబాబునైతే... నీవు కల్యాణాల పవన్ వి అని అన్నారు. అంతేకాదు... 'PK అంటే పిచ్చికుక్క @PawanKalyan' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజా డైమండ్ రాణి అయితే... నీవు బాబు గారి జోకర్ వి అని ఎద్దేవా చేశారు.

Ambati Rambabu
Roja
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News