Perni Nani: పవన్ కల్యాణ్ ఒక్కటి మాత్రం నిజం చెప్పాడు: పేర్ని నాని

Perni Nani reacts Pawan Kaluan remarks

  • రణస్థలం సభలో వైసీపీ నేతలపై పవన్ ఫైర్
  • ఈసారి ఒంటరిగా పోటీ చేయలేనని నిజం చెప్పాడన్న పేర్ని నాని
  • దత్తపుత్రుడు అంటూ ఊగిపోతున్నాడని విమర్శలు

శ్రీకాకుళం రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభలో పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. ఈ సభలో పవన్ కల్యాణ్ అనేక అబద్ధాలు చెప్పినప్పటికీ, ఒకటి మాత్రం నిజం చెప్పాడని అన్నారు. మరోసారి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి వీరమరణం పొందలేనని చెప్పాడని, అందులో వాస్తవం ఉందని ఎద్దేవా చేశారు. గతంలో జగన్ చేతిలో ఒకసారి బడితెపూజ జరిగింది, ఈసారి కుక్కచావు చావడం ఎందుకని పవన్ నిజం చెప్పాడన్నారు. 

"తానెందుకు చంద్రబాబు సంకలో దూరాల్సి వస్తుందో చెప్పడానికే పవన్ ఈ సభ ఏర్పాటు చేశాడు. యువతకు ఉద్యోగాలు, యువతకు ఉపాధి అంతా వట్టిదే. జగన్ మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అంటే పవన్ బాగా ఊగిపోతున్నాడు. ఉత్తరాంధ్రలో సత్యానంద్ వద్ద పవన్ నేర్చుకున్న విద్యే కదా ఇది. ఊగడం, ఆగడం ఆయనకు అలవాటే. 

చంద్రబాబుతో నీకు ఉన్నది అత్తా అల్లుడి సంబంధమో, మామా అల్లుడి సంబంధమో, దత్తతండ్రి, దత్తపుత్రుడి సంబంధమో... నీ నోటితో నువ్వే చెబుతున్నావు, మళ్లీ ఉలిక్కిపడుతున్నావు. చంద్రబాబు ఎదురింట్లో ఉన్న అత్త లాంటోడు, మామ లాంటోడు అని చెబుతున్నావు కదా, జగన్ మోహన్ రెడ్డి ఏం చెబుతున్నారంటే... అత్తా మామ కాదయ్యా దత్తతండ్రి అని చెబుతున్నారు. వరసే కదా తేడా!" అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. 

"డీజీపీ గారూ మీరు ఖైదీ నెం.6093కి సెల్యూట్ కొడుతున్నారు అని పవన్ అంటున్నాడు. తెలుగు భాషా ఉద్యమానికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు వంటి వారు, ఇంట్లో తాళికట్టిన భార్య ఉండగా, పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారిని తిరుగుబోతులు అంటారని చెప్పారు. మరి తిరుగుబోతులకు నమస్కారాలు పెట్టాలా? తిరుగుబోతులకు జైకొట్టాలా? తిరుగుబోతులకు బ్యానర్లు కట్టాలా? చంద్రబాబు, సోనియా గాంధీ కుమ్కక్కై తప్పుడు కేసులు బనాయించారని నమ్మారు కాబట్టే జనం తమ నాయకుడిగా జగన్ ను ఎన్నుకున్నారన్న సంగతి గ్రహించాలి" అంటూ పేర్ని నాని హితవు పలికారు.

Perni Nani
Pawan Kalyan
Jagan
Chandrababu
YSRCP
Janasena
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News