Nabha Natesh: ప్రమాదం జరగడం వల్లనే గ్యాప్ వచ్చిందన్న నభా నటేశ్!

Nabha Natesh Special

  • తెలుగులో స్పీడ్ చూపించిన నభా నటేశ్
  • యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ 
  • ఈ మధ్య గ్యాప్ తీసుకున్న నభా 
  • అందుకు కారణం తనకి ప్రమాదమేనని వెల్లడి
  • త్వరలోనే మళ్లీ కెమెరా ముందుకు 

టాలీవుడ్ కి ఇలా పరిచయమైన నభా నటేశ్, అలా దూసుకుపోయింది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అందాల సందడి చేసిన ఈ సుందరి, ఆ తరువాత రవితేజ .. సాయితేజ్ .. నితిన్ .. బెల్లంకొండ శీను జోడీగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. 'మ్యాస్ట్రో' తరువాత తెరపై ఆమె కనిపించలేదు. 

వరుస ఫ్లాపుల కారణంగా అవకాశాలు రావడం లేదేమోనని అంతా అనుకున్నారు. కానీ అసలు సంగతి ఏమిటనేది తాజాగా నభా నటేశ్ వెల్లడించింది. క్రితం ఏడాది తనకి యాక్సిడెంట్ అయిందనీ, ఎడమ భుజం దగ్గర బోన్స్ విరగటం వలన సర్జరీలు జరిగాయని చెప్పింది. ఈ కారణంగానే తాను సినిమాలకి దూరంగా ఉండవలసి వచ్చింది" అని చెప్పింది. 

"నిజంగా అది చాలా కష్టతరమైన పరిస్థితి. దానిని దాటుకుని మళ్లీ సినిమాలు చేయడానికి ట్రై చేయడం అంత తేలికైన పనేం కాదు. కానీ మీ అందరి అభిమానం వలన నేను త్వరగా కోలుకున్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను'' అంటూ అభిమానులను ఉద్దేశించి ఒక లెటర్ రాసింది. నభా నటేశ్ హఠాత్తుగా కనిపించకుండా పోవడానికి కారణం ఇదన్న మాట.

Nabha Natesh
Actress
Tollywood
  • Loading...

More Telugu News