Evergreen Marine Corporation: ఈ సంస్థ ఉద్యోగులకు పంట పండింది... ఒకేసారి నాలుగేళ్ల బోనస్
- తైవాన్ కు చెందిన ఎవర్ గ్రీన్ మెరైన్ కార్ప్ కీలక నిర్ణయం
- బోనస్ గా 50 నెలల జీతం
- పనితీరు ఆధారంగా బోనస్
- వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా ఎవర్ గ్రీన్ మెరైన్ కార్ప్ నిర్ణయం
ఏ సంస్థ అయినా ఒక నెల జీతం బోనస్ ఇవ్వడం సాధారణమైన విషయమే. కానీ తైవాన్ కు చెందిన ఓ సంస్థ ఏకంగా నాలుగు సంవత్సరాల బోనస్ ప్రకటించి ఉద్యోగులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆ సంస్థ పేరు ఎవర్ గ్రీన్ మెరైన్ కార్పొరేషన్. వస్తు రవాణా రంగంలో దిగ్గజ సంస్థగా గుర్తింపు పొందింది.
తాజాగా ఆ సంస్థ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 50 నెలల జీతానికి సమానమైన మొత్తాన్ని సంవత్సరాంత బోనస్ రూపంలో ఇస్తోంది మరి. అయితే ఆ సంస్థలోని అందరు ఉద్యోగులకు కాదట.
పనితీరు ఆధారంగా ప్రమోషన్లు పొంది ఓ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు, అది కూడా తైవాన్ నియమ నిబంధనల ప్రకారం ఉద్యోగ కాంట్రాక్టు కలిగివున్న వారికే ఈ బోనస్ ఇస్తున్నారు. ఈ మేరకు ఎవర్ గ్రీన్ మెరైన్ కార్ప్ ఓ ప్రకటన చేసింది. ఈ తైవాన్ సంస్థ నిర్ణయం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.