Mallu Ravi: కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవికి సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు

Cyber Crime Police issues notice to Mallu Ravi

  • బీఆర్ఎస్ అధినాయకత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు
  • కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుపై కేసు
  • వార్ రూమ్ కు తానే ఇన్చార్జినన్న మల్లు రవి
  • ఈ నెల 12న విచారణకు హాజరుకావాలంటూ సీఆర్పీసీ నోటీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలకు వ్యతిరేకంగా తెలంగాణ గళం పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుపై పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ వార్ రూమ్ పై తనిఖీలు చేసిన పోలీసులు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. 

తాజాగా ఈ కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవికి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలంటూ సీఆర్సీపీసీ 41 కింద నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ వార్ రూమ్ కు తానే ఇన్చార్జిని అని, ఇస్తే తనకు నోటీసులు ఇవ్వాలి కానీ, సునీల్ కనుగోలుకు సంబంధమేంటని మల్లు రవి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే మల్లు రవికి పోలీసులు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.  

ఇక ఈ కేసులో సునీల్ కనుగోలును నేడు పోలీసులు విచారించారు. అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

Mallu Ravi
Notice
Cyber Crime Police
War Room Case
Congress
KCR
KTR
Kavitha
  • Loading...

More Telugu News