Waltair Veerayya: మెగా ఫ్యాన్స్​ కు అలర్ట్​ .. సాయంత్రం 6.03 గంటలకు వాల్తేరు వీరయ్య ట్రైలర్​​

Waltair Veerayya Trailer strikes today at 6 03 PM

  • మరో పోస్టర్ ను వదిలిన చిత్ర బృందం
  • రేపు వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ నెల 13న విడుదల అవుతున్న మెగా చిత్రం

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' చిత్రం కోసం ఆయన అభిమానులు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. మెగాస్టార్ చాన్నాళ్ల తర్వాత పూర్తిస్థాయి మాస్ పాత్రలో కనిపించడంతో ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే పోస్టర్ల నుంచి పాటలు వదులుతూ చిత్ర బృందం అంచనాలను మరింత పెంచుతోంది. ఈ మెగా మాస్ చిత్రం ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6.03 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. 

మాస్ మూలవిరాట్ వేట మొదలూ.. అంటూ సముద్ర అలల బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి బల్లెం పట్టుకొని ఉన్న మాస్ పోస్టర్ ను కూడా వదిలింది. మరోవైపు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విశాఖ నగరం ఆతిథ్యమిస్తోంది. ఆదివారం జరిగే ఈవెంట్ కోసం చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ లోపే ట్రైలర్ తో అభిమానులకు ట్రీట్ ఇవ్వనుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటించింది. మాస్ మహారాజా రవితేజ, కేథరిన్ ట్రెసా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Waltair Veerayya
Chiranjeevi
trailer
today
  • Loading...

More Telugu News